రాప్తాడు పాఠశాలలో బాలికపై దాడి: నిందితుడిపై పోలీసుల కాల్పులు

రిపోర్టర్: రాము స్థలం: రాప్తాడు

అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదోతరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో పాశవిక దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్ పై పోలీసులు ఆత్మకూరు అటవీప్రాంతంలో కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు యత్నించి సీఐపై దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం ఆరురౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన నిందితుడిని అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని, బాధితురాలికి బెంగళూరులో వైద్యం అందుతోందని అధికారులు పేర్కొన్నారు.