టీడీపీ నేతల తప్పుడు ప్రచారంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే గణేష్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ నేతలు రూ. 257 కోట్ల నిధులు మంజూరయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులపై పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, ప్రజలను మోసం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తూ స్థానిక రాజకీయాల్లో కలకలం రేపారు.