కోల్కతా వర్సిటీలో కలకలం: వివేకానంద పోస్టర్ను అవమానించిన విద్యార్థినుల బహిష్కరణ
రిపోర్టర్: రమేష్
స్థలం: Kolkata
స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు రాసి అవమానించిన ఘటనలో ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కోల్కతాలోని ప్రతిష్టాత్మక ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో ఈ వివాదం చెలరేగింది. అక్టోబర్ 13న ఏబీవీపీ ఏర్పాటు చేసిన పోస్టర్ను ధ్వంసం చేస్తూ అవమానించిన ఇద్దరు మహిళా విద్యార్థినులను వర్సిటీ నుంచి పూర్తిగా బహిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఎలాంటి డిగ్రీ కోర్సుల్లోనూ వారికి ప్రవేశం ఉండదని తేల్చిచెప్పారు.