స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కుళ్ళిన గుడ్ల డెలివరీపై సోషల్ మీడియాలో నిప్పులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన గుడ్ల ట్రేలో దాదాపు అన్నీ కుళ్ళిపోయి ఉన్నాయని ప్రముఖ జర్నలిస్ట్ సుశాంత్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు చెల్లించి నాణ్యమైన ఆహారం కొనుగోలు చేస్తున్నా అనారోగ్యకరమైన వస్తువులు డెలివరీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ఫుడ్ సేఫ్టీ ప్రమాదాలపై వినియోగదారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.