స్పెషల్ టెట్ ఫలితాలపై తీవ్ర సందిగ్ధం: ఆందోళనలో ఉపాధ్యాయులు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

ఏపీలో ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన స్పెషల్ టెట్ ఫలితాల వెల్లడిపై తీవ్ర సందిగ్ధం నెలకొందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 11 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షలకు ఎనుబది వేలకు పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ రావలసి ఉన్నప్పటికీ విద్యాశాఖ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని స్పష్టం చేశారు.