టాంజానియాలో ఏనుగుల రాకపోకల కోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటు

రిపోర్టర్: సునీల్ స్థలం: టాంజానియా

ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఏనుగుల సంచారం కోసం ప్రత్యేక వన్యప్రాణి కారిడార్కు అధికారిక రక్షణ కల్పించినట్లు అధికారులు తెలిపారు. నైరేరే నేషనల్ పార్క్ నుంచి ఉద్జుంగ్వా పర్వతాల వర్షారణ్యాల వరకు ఏనుగులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు ఈ కారిడార్ను ఏర్పాటు చేశారు. కిలోంబెరో లోయ గుండా వెళ్లే ఈ మార్గంలో స్థానిక సంఘాలు, సంరక్షణ సంస్థల ఆధ్వర్యంలో లక్ష స్వదేశీ మొక్కలను నాటి పర్యావరణాన్ని పునరుద్ధరించారు. ఈ ప్రాంతం గుండా సుమారు వెయ్యి ఏనుగులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.