పోలీసుల చిత్రహింసల వల్లే చీకటి గోపి మృతి చెందారంటూ మంద కృష్ణమాదిగ ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా పొన్నెకల్లుకు చెందిన చీకటి గోపి పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట దళిత ప్రజాసంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ గోపి మృతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సిట్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాజధాని ప్రాంతాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు.