'డ్రగ్స్ వద్దు బ్రో': పలాస కళాశాలలో అవగాహన సదస్సు
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు పలాసలోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మంగళవారం 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో EAGLE సెల్ సభ్యుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ వాడకం వల్ల ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు వస్తాయని, యువత పెడదోవ పట్టి జీవితాలు నాశనం చేసుకుంటారని విద్యార్థులకు ఆయన వివరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే EAGLE '1972' టోల్ ఫ్రీ నంబర్ కు తెలియజేయాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన సూచించారు.