ఈసీ నిర్ణయాలపై విపక్షాల నిరసన: జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నట్లు విపక్ష కూటమి నేతలు వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిర్వాచన్ సదన్ ముట్టడికి యత్నించాయి. అక్టోబర్ రెండు నుంచి ప్రారంభమైన ఈ ఆందోళనలు ఐదో రోజుకు చేరడంతో పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు.