జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయం: రోజువారీ విచారణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణను రోజువారీగా చేపట్టాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను కూడా ఇకపై ప్రతిరోజూ విచారించనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. గత పదేళ్లుగా కోర్టులో పెండింగ్లో ఉన్న ఈ ఛార్జిషీట్లపై త్వరలోనే తుది విచారణ పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.