దుబాయ్ రియల్ ఎస్టేట్ రికార్డు: రూ. 4 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్

రిపోర్టర్: సురేష్ స్థలం: Dubai

దుబాయ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ నతాలియా చావెజ్కు కంపెనీ సీఈఓ ఫహ్మి అవాద్ లంబోర్గిని కారును బహుమతిగా అందించినట్లు రిచ్కీ ప్రాపర్టీస్ సంస్థ వెల్లడించింది. రెండేళ్లలో ఐదు వందల మిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించినందుకు ఆమెను టాప్ పెర్ఫార్మర్గా ఎంపిక చేసి వార్షిక వేడుకల్లో ఈ అరుదైన బహుమతిని అందజేశారు. ఈ విలాసవంతమైన కారు ధర భారత కరెన్సీలో సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకు ఉంటుందని నిర్వహకులు తెలిపారు.