గాజువాకలో మల్టీపర్పస్ ఓపెన్ షెడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలోని టీజీఆర్ నగర్లో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ ఓపెన్ షెడ్‌ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ కార్యదర్శి బొండా జగన్నాధం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ షెడ్డును వివాహాలు, సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని కోరగా, నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు.