రాప్తాడు బాలికపై ఉన్మాది దాడి: సొంత కూతురిలా చూసుకుంటానని మంత్రి నారా లోకేష్ భరోసా

రిపోర్టర్: విజయ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను సొంత కూతురిలా భావించి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వచ్చే 48 గంటలు అత్యంత కీలకమని ఆయన తెలిపారు. విద్యార్థుల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, దాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.