గుర్గావ్‌ హిట్ అండ్‌ రన్: నిందితుల వాదనలను తోసిపుచ్చిన బాధితురాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Haryana

గుర్గావ్‌ హిట్ అండ్‌ రన్ కేసులో నిందితుల తరఫు వాదనలను బాధితురాలు సియా తీవ్రంగా ఖండించారు. కారు కావాలనే తనను ఢీకొట్టిందని, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారమంతా అబద్ధమని స్పష్టం చేశారు. కారులో ఉన్న నలుగురిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, అందరినీ అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుడి అత్యవసర వైద్య చికిత్స వాదనలను ఆమె తండ్రి కొట్టిపారేశారు.