స్థానిక ఎన్నికల బరిలోకి ఎంఐఎం: ఇరవై ఒక్క చోట్ల నామినేషన్ల దాఖలు
రిపోర్టర్: రమేష్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీకి సిద్ధమైందని రాష్ట్ర పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థానాల్లో మొత్తం ఇరవై ఒక్క చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా కడప మేయర్ స్థానంతో పాటు హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా నామినేషన్లు వేశారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి బరిలో నిలిచామని నేతలు పేర్కొన్నారు.