బాలీవుడ్ లో కలకలం: నటుడు తుషార్ కపూర్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
బాలీవుడ్ ప్రముఖ నటుడు తుషార్ కపూర్ కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. తమకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే హత్య చేస్తామని హ్యారీ బాక్సర్ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన తుషార్ కపూర్ వారం రోజుల క్రితమే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు.