టీఎస్‌ లాసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో టీఎస్‌ లాసెట్‌ 2026 తుది విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 17 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 25న సీట్ల కేటాయింపు జాబితా విడుదల కానుంది.