వీరంపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా సాయి నీలిమను గెలిపించాలని కిరణ్ పిలుపు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

మనుబోలు మండలం వీరంపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా సాయి నీలిమ బరిలో నిలిచారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆ పార్టీల అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రత్యర్థి పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ నాయకులు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు.