ధన్వాడ కొండాపూర్ రహదారి పనులపై స్పందించిన అధికారులు
రిపోర్టర్: విజయ్
స్థలం: నారాయణపేట
నారాయణపేట జిల్లా ధన్వాడ కొండాపూర్ రహదారిలో జరుగుతున్న వెడల్పు పనుల వద్ద భద్రతా లోపాలపై దిశ పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ప్రమాదాలు జరగకుండా ప్రతి కల్వర్టు వద్ద ప్రత్యేకంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసి పనులు చేపడుతున్నారు. పనులు కొనసాగుతున్నందున అప్పుడప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉందని, ప్రయాణికులు, వాహనదారులు సహకరించాలని అధికారులు, గుత్తేదారులు కోరారు.