వచ్చే ఎన్నికల్లో వంద సీట్లే లక్ష్యమంటూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాలు సాధించడమే తమ పార్టీ లక్ష్యమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీశ్ రావు వాస్తవాలు గ్రహించకుండా భ్రమల్లో బతుకుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, బీజేపీ పని అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.