స్టార్డమ్ బరువును ఎప్పుడూ మోయను: బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్
రిపోర్టర్: నరేష్
స్థలం: Mumbai
స్టార్డమ్ బరువును తాను ఎప్పుడూ భుజాలపై మోయలేనని, అలా చేస్తే ఒంటరితనం పెరుగుతుందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. ఉత్తర అమెరికాలో తన తాజా నాటక ప్రదర్శన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతానని చెప్పారు. ఏకాంతంగా ఉండటం భయపెడుతుందని, ప్రజలతో మమేకమైనప్పుడే నిజమైన ఆనందం దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు.