అమెరికా విమానయాన సంస్థలో డైరెక్టర్గా ఎంపికైన తెలుగు వ్యక్తి

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

అమెరికాలోని ప్రముఖ యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థలో డైరెక్టర్ ఆఫ్ సర్టిఫికేషన్గా ప్రవాస తెలుగు వ్యక్తి గన్నిరాజు తుమరాడ పదోన్నతి పొందారని ఆ సంస్థ టెక్ ఆప్స్ వైస్ ప్రెసిడెంట్ మారా పాలిస్కో వెల్లడించారు. ఈ కొత్త బాధ్యతలలో భాగంగా ఆయన విమానాల సర్టిఫికేషన్, భద్రతా ప్రమాణాల బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఏలూరుకు చెందిన ఆయన హైదరాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేసి, మెకానికల్ ఇంజినీరింగ్లో ఉన్నత చదువులు అభ్యసించారు.