ఓట్ల లెక్కింపు వేళ హుకుంపేట వారపు సంతపై పోలీసుల నిషేధం

రిపోర్టర్: srinu boddeti స్థలం: హుకుంపేట

స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల నేపథ్యంలో పోలీసు శాఖ ఆదేశాల మేరకు హుకుంపేట గ్రామంలో ఈ నెల ఏడో తేదీన జరగాల్సిన వారపు సంతను పూర్తిగా రద్దు చేసినట్లు పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రకటించారు. జూనియర్ కళాశాల వద్ద కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.