కరెంట్ కోతలపై రేవంత్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: నల్లగొండ

నల్లగొండ జిల్లా కనగల్ మండలం తిమ్మన్నగూడెం, తెలకంటిగూడెంలలో సబ్ స్టేషన్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లాగ్ బుక్ పరిశీలించారు. రాష్ట్రంలో ఎండిపోతున్న పంటపొలాల మధ్యలో ఉన్న సబ్ స్టేషన్లను తనిఖీ చేసి కరెంట్ కోతలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. రోజుకు కేవలం ఏడు నుంచి ఎనిమిది గంటలు, కొన్ని రోజులైతే ఐదు నుంచి ఆరు గంటలే విద్యుత్ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు.