కలకలం రేపిన మార్ఫింగ్ వీడియో: సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ పై కేసు నమోదు
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
రష్యా విదేశాంగ మంత్రికి సంబంధించిన మార్ఫింగ్ చేసిన నకిలీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అసలైన వీడియో అని భావించే తాను పోస్ట్ చేశానని, అది మార్ఫింగ్ అని తెలిశాక డిలీట్ చేశానని ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు. ఈ ఘటనపై ప్రత్యేక సెల్ పోలీసులు పలు సెక్షన్ల కింద దర్యాప్తు జరుపుతున్నారు.