లూధియానాలో సీఎం భగవంత్ మాన్ కాన్వాయ్‌పై గుడ్లు, టమాటాలతో రవ్‌నీత్ సింగ్ బిట్టు నిరసన
రిపోర్టర్: వెంకట్
స్థలం: Ludhiana
పంజాబ్ లోని లూధియానాలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కాన్వాయ్‌పై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు గుడ్లు, టమాటాలతో నిరసన తెలిపారు. తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి నిరసనగా ఆయన ఈ ఆందోళన చేపట్టగా, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గ్యాంగ్‌స్టర్ పార్టీగా మారిందని, తనపై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.