తమ్ముడు.. లెట్స్ డూ కుమ్ముడు అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తమ్ముడు.. లెట్స్ డూ కుమ్ముడు అన్నట్లు సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి రూ. 200 కోట్ల విలువైన కొంగరకలాన్ భూమిని కేవలం రూ. 7 కోట్లకే కట్టబెట్టారని, సెక్షన్ 22ఏ పేరుతో సామాన్యులను వేధిస్తున్నారని విమర్శించారు.