భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల్లో ఆగమశాస్త్ర ఉల్లంఘనపై తీవ్ర వివాదం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వైఖానస ఆగమశాస్త్ర నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ భక్తులు, వేదపండితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.276 కోట్లతో చేపట్టిన మాస్టర్ ప్లాన్ నిర్మాణాల వల్ల ఆలయ పవిత్రత దెబ్బతింటోందని ఆరోపిస్తున్నారు. కాంక్రీట్ రిటైనింగ్ వాల్‌పై ఉపాలయాల నిర్మాణం ఆగమశాస్త్ర విరుద్ధమని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి శాస్త్రోక్తంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.