గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేసిన కేంద్రం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఇండియా

గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ అందుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ లేదా ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన పూర్తిగా అమల్లోకి రానుంది. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోని వినియోగదారులకు సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు.