అనపర్తిలో రూ.2 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

రిపోర్టర్: గోపి స్థలం: అనపర్తి

అనపర్తి నియోజకవర్గంలో రాజానగరం పెద్దాపురం రోడ్డు నుంచి వడిశలేరు మీదుగా తూర్పుగానుగూడెం వరకు రెండు కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.