ట్రాన్స్జెండర్లపై మోహన్ జీ వ్యాఖ్యలు: కార్తీక్ సుబ్బరాజ్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: చెన్నై
ట్రాన్స్జెండర్లపై దర్శకుడు మోహన్ జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ సినీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు కనడం గురించిన ప్రశ్నలు అడుగుతూ వారిని అవమానించడం మానసిక హింస కిందకే వస్తుందని ఆయన మండిపడ్డారు. డొరొథీ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ట్రాన్స్జెండర్ల జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రతి ఒక్కరూ వారికి గౌరవం ఇవ్వాలని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డిమాండ్ చేశారు.