వరంగల్ విమానాశ్రయానికి పేర్లు సూచించిన ప్రముఖ సినీ దర్శకులు
రిపోర్టర్: సురేష్
స్థలం: వరంగల్
వరంగల్ మామునూరు విమానాశ్రయానికి తగిన పేరు సూచించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంతో ప్రముఖ సినీ దర్శకులు సందీప్ రెడ్డి వంగా, శ్రీకాంత్ ఓదెల స్పందించారు. రుద్రమ, కాకతీయ, సమ్మక్క సారక్క పేర్లను వారు సోషల్ మీడియా వేదికగా ప్రతిపాదించారు. సొంతూరుకు విమానాశ్రయం రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.