యువత ఆలోచనలతో ఐ హేట్ మ్యారేజ్ సినిమా టీజర్ విడుదల

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

నేటి తరంలో ప్రేమ, పెళ్లి మరియు కెరీర్పై యువత ఆలోచనలను ప్రతిబింబిస్తూ తెరకెక్కుతున్న యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఐ హేట్ మ్యారేజ్' సినిమా టీజర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిందని దర్శకుడు పరమేశ్ రేణుకుంట్ల తెలిపారు. సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్య సినిమా బ్యానర్పై మాదం దయానంద్, కార్తిక్ వెంపటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జెన్ జెడ్ తరం భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నమే ఈ చిత్రమని ఆయన వెల్లడించారు.