చిన్నఓరంపాడు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి లక్ష్మీదేవి ఏకగ్రీవ విజయం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఓబులవారిపల్లి
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంజిమేటి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మండల రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఆమె అధికారికంగా ఎన్నికల డిక్లరేషన్ ఫారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని లక్ష్మీదేవి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.