ఫౌజీ గ్లింప్స్ విడుదల: ప్రభాస్ పీరియాడిక్ వార్ డ్రామాపై భారీ అంచనాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైల్ నెం.25 ఫౌజీ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ గ్లింప్స్ విడుదలైందని చిత్ర యూనిట్ తెలిపింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంతో రూపొందుతున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రంలో ప్రభాస్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉండనుందని, ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ స్పష్టం చేశారు.