గ్రామ సమస్యలపై జనసేన దృష్టి: పాలిచర్లపాడులో బాటపట్టిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

రిపోర్టర్: sai స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని పాలిచర్లపాడు అరుంధతివాడలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, వీధిలైట్లు ఇతర సమస్యలను జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సచివాలయ కార్యదర్శితో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.