ఓబులవారిపల్లె మండల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఓబులవారిపల్లె
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ స్వయంగా ఓబులవారిపల్లె మండల నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి, నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన స్థానిక సిబ్బందిని ఆదేశించారు.