బీసీల రిజర్వేషన్లు కుదించి జగన్ మోసం చేశారు: మంత్రి కొల్లు రవీంద్ర
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కృష్ణా
బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి కుట్రలు చేశారని, 34 శాతం రిజర్వేషన్లు కుదించి పదవులు దూరం చేశారని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేసి వెనుకబడిన వర్గాలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.