హైదరాబాద్ కాచిగూడ గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని కాచిగూడలో ఘనంగా నిర్వహించిన గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో కేంద్రమంత్రి G Kishan Reddy స్వయంగా పాల్గొని మహా గణపతి శోభాయాత్రలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా ఆయన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ దైవ ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. భక్తులతో కలిసి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్న ఆయన, నగరంలో వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో సంప్రదాయబద్ధంగా ముగియడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.