చరిత్రలో అద్భుతం: రెండు దశాబ్దాల తర్వాత అన్మెహోటప్ సమాధి పునఃప్రారంభం

రిపోర్టర్: హరి స్థలం: లక్సోర్

పురాతన ఈజిప్ట్ చరిత్రలో అత్యంత కీలకమైన మూడు వేల నూట ఏళ్ల కిందటి అన్మెహోటప్ మూడు సమాధిని పర్యాటకుల కోసం మళ్లీ తెరిచినట్లు అంతర్జాతీయ పురావస్తు అధికారులు తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ పునరుద్ధరణ పనుల అనంతరం లక్సోర్ నగరంలో ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శకులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అద్భుత కట్టడం ద్వారా పర్యాటకులకు సరికొత్త అనుభూతి లభిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.