సీఈవో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నిరసనలు

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎన్నికల సంఘం కార్యాలయాల ఎదుట భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తన రాష్ట్రాల కమిటీలను ఆదేశించింది. ఓటర్ల జాబితాలో జరిపిన మార్పులపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, ఈసీ స్వయంప్రతిపత్తిని కాపాడేందుకే ఈ పోరాటమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.