'ఇనుప రాడ్డుతో కొట్టి యాసిడ్ పోసింది': విజయనగరం జిల్లాలో ప్రియుడి హత్య

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ హత్య జరిగింది. భర్తకు దూరంగా ఉంటున్న దనాల రాములమ్మ, తన బావ కుమారుడైన శ్రీనుతో కలిసి సహజీవనం చేస్తోంది. గురువారం తెల్లవారుజామున వీరిద్దరి మధ్య తలెత్తిన తీవ్ర ఘర్షణలో రాములమ్మ ఇనుపరాడ్డుతో శ్రీను తలపై బలంగా కొట్టి, అనంతరం యాసిడ్ పోయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చీపురుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.