భార్య మరణాంతరం కన్నీరుమున్నీరైన మలయాళ నటుడు వినోద్ కోజికోడ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కేరళ
ప్రముఖ మలయాళ నటుడు వినోద్ కోజికోడ్ తన భార్య అకస్మిక మరణం గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మార్నింగ్ వాక్కు వెళ్లే ముందు భార్య శ్వాసలో తేడాను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భార్య మరణాన్ని ప్రత్యక్షంగా చూడటం ఎవరికీ వరం కాదని, తాను ఆమెకంటే ముందే కన్నుమూయాలని కోరుకున్నట్లు వినోద్ కోజికోడ్ కంటతడి పెట్టుకున్నారు.