శవ రాజకీయం మానుకోవాలి.. కాకానిపై టీడీపీ నేతల మండిపాటు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేతలు సండి రమేష్, ఉప్పు అశోక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన సండ్ర రవి కుటుంబాన్ని పరామర్శించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.

అనారోగ్యంతో మరణించిన సండ్ర రవి మృతిపై కాకాని గోవర్ధన్ రెడ్డి శవ రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం తగదని, ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.