పంచాయతీ నిధుల స్వాహా.. కాకాని అనుచరులపై అవినీతి ఆరోపణలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వెంకటాచలం
వెంకటాచలం పంచాయతీలో కాకాని ముఖ్య అనుచరుడు మందల వెంకట శేషయ్య తొమ్మిదేళ్లుగా దోచుకున్నాడని టీడీపీ నాయకులు ఆరోపించారు. వెంకట శేషయ్య భార్య సర్పంచిగా ఉన్న సమయంలో కోటి రూపాయలకు పైగా అవినీతికి పాల్పడటంతో పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
కసుమూరులో అక్రమంగా సంపాదించిన ఎనిమిది ఎకరాల పొలాన్ని రెవెన్యూ అధికారులు రద్దు చేశారని నేతలు తెలిపారు. RO వాటర్ ప్లాంట్ స్థలానికి నకిలీ పొజిషన్ సర్టిఫికేట్ సృష్టించి దొరికిపోయిన వారి మాటలు విని కాకాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.