నాగావళి నదిలో వరద ముప్పుపై అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా నాగావళి నదిలో వరద ప్రవాహం 60 వేల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో వంగర, సంతకవిటి, రేగిడి మండలాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.