అమెరికాతో చర్చలకు ఏడు డిమాండ్లు ఉంచిన ఇరాన్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: టెహ్రాన్
అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరాన్ ఏడు డిమాండ్లను అమెరికా ముందుంచింది. ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ ద్వారా ఈ షరతులను పంపినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయి ప్రకటించారు. ట్రంప్ ఈ డిమాండ్లను తిరస్కరిస్తే నిర్ణాత్మక యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.