స్థానిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది: విస్తృతంగా అభ్యర్థుల ఓట్ల వేట

రిపోర్టర్: గోపి స్థలం: సాలూరు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి గొడుగు పట్టుకుని మరీ ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లో నాయకులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.