దివ్యాంగుల పింఛన్ దరఖాస్తులకు ఈనెల 15 వరకు అవకాశం
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో అర్హులైన దివ్యాంగుల పింఛన్ దరఖాస్తుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సదరం సర్టిఫికేట్లు గడువు తీరిన వారు వెంటనే రెన్యువల్ చేసుకోవాలని, సాంకేతిక సమస్యలు రాకుండా తగిన పత్రాలు జతపరచాలని అధికారులు తెలిపారు.