ఢిల్లీ భవన కూలుపు ఘటనలో మృతి చెందిన కార్మికుడి కుటుంబం దయనీయ స్థితి
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో భవనం కూలిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధ్యప్రదేశ్ లోని హర్ పాల్ పూర్ కు చెందిన వెల్డర్ పరమ్ లాల్ కోరి కుటుంబం రోడ్డున పడింది. ఏకైక సంపాదనపరుడైన పరమ్ లాల్ మృతి చెందడంతో భార్య, ఐదేళ్ల కుమారుడు, వృద్ధురాలైన తల్లి తీవ్ర వేదనను ఎదుర్కొంటున్నారు. తండ్రి ఎక్కడని ప్రశ్నిస్తున్న చిన్నారికి నిజం చెప్పలేక, జీవనం ఎలా సాగించాలో తెలియక ఆ కుటుంబం పడుతున్న వేదన అందరినీ కలచివేస్తోంది.